Ramgopal Varma: చేత్తో కత్తి పట్టుకుని 'ఖబడ్దార్' అంటున్న రామ్ గోపాల్ వర్మ!

  • సినిమా విడుదలకు అడ్డొస్తే ఖబడ్దార్
  • ఎన్టీఆర్ అసలు నాయకుడన్న విషయం నా సినిమాతో తెలుస్తుంది
  • ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కావాల్సినంత ప్రచారాన్ని, హైప్ ను క్రియేట్ చేస్తూ వెళుతుండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాను తాజాగా తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు సైతం జోరుగా ప్రచారాన్ని చేసుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర చిత్రాలను, పాటలను విడుదల చేసిన ఆయన, తాను కత్తి పట్టుకుని ఉన్నట్టు ఓ మార్ఫింగ్ ఫోటోను ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ, "లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ఎవరైనా అడ్డొస్తే ఖబడ్దార్" అని కామెంట్ పెట్టారు.

ఆపై, "రేయ్... ఎన్టీఆర్ కథానాయకుడు కాదు, మహానాయకుడు కాదురా... ఆయన అసలు నాయకుడు. ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని అసలు కథలో తెలుస్తుందిరా. డబుల్ ఖబడ్దార్" అన్నారు. మరో ట్వీట్ ను జోడిస్తూ, "ఎన్టీఆర్ గారు అసలు నాయకుడు. నేను ముదురు నాయకుడిని. మిగతావారు రకరకాల, వేరే రకాల నాయకులు. వెన్నుపోటు నాయకులతో సహా" అని అన్నారు. వర్మ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.







Ramgopal Varma
Twitter
NTR
Lakshmis Ntr

More Telugu News