chigurupati jayaram: 2016 నుంచి ప్రాణాపాయం ఉందని జయరాం నాతో చెప్పేవారు: భార్య పద్మశ్రీ

  • సొంత అక్కతోనే తనకు ప్రాణహాని ఉందనే వారు
  • సమావేశాల కోసమే యూఎస్ నుంచి ఆయన వచ్చారు
  • ఇక్కడికి వచ్చాక ఘోరంగా చంపుతారని ఊహించలేదు
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించిన విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. పోలీసుల విచారణలో జయరాం భార్య పద్మశ్రీ చెప్పిన విషయాలే ఇందుకు నిదర్శనం. 2016 నుంచి తనకు ప్రాణాపాయం ఉందని, సొంత అక్కతోనే తనకు ప్రాణహాని ఉందని తన భర్త జయరాం తనతో చెబుతుండేవారని  అన్నారు.

జయరాం బంధువుల నుంచే ఆయనకు ప్రమాదం వచ్చిందని, సమావేశాల నిమిత్తమే జయరాం అమెరికా నుంచి భారత్ కు వచ్చారని, ఇక్కడికి వచ్చాక ఇంత ఘోరంగా చంపుతారని ఊహించలేదని అన్నారు. మేనకోడలు శిఖా చౌదరి ప్రమేయం ఎక్కువ కావడంతో ఆమెను ఎక్స్ ప్రెస్ టీవీ ఛానెల్ బాధ్యతల నుంచి తప్పించిన విషయాన్ని పద్మశ్రీ ప్రస్తావించినట్టు సమాచారం.
chigurupati jayaram
padma sri
sikha chowdary

More Telugu News