NDA: మళ్లీ ఎన్డీఏలోకి వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించినా రానివ్వం: అమిత్ షా

  • ఎన్టీఆర్ ని చంద్రబాబు మోసం చేశారు
  • 2019లో మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం
  • అప్పుడు ఎన్డీఏలోకి రావాలని బాబు చూస్తే రానివ్వం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శల వర్షం కురిపించారు. విజయనగరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీలోనే అని, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లి, ఎన్టీఆర్ ని మోసం చేసి పార్టీ పగ్గాలను చేజిక్కుంచుకున్నారని వ్యాఖ్యానించారు. ఆపై ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరిన చంద్రబాబు బయటకొచ్చేశారని అన్నారు.

2019లో మోదీ తిరిగి ప్రధాని కావడం ఖాయమని, మళ్లీ ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు ప్రయత్నిస్తే కనుక తాము రానివ్వమని స్పష్టం చేశారు. చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ను సీఎం చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించిన అమిత్ షా, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టు అయినా ఆ ప్రాంతానికి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు.
NDA
BJP
Amit Shah
Chandrababu
Telugudesam

More Telugu News