West Bengal: ప్రధాని మోదీది ఓవరాక్షన్‌ : మాజీ ప్రధాని దేవెగౌడ

  • సీబీఐ తన అధికారాలను దుర్వినియోగం చేసింది
  • ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పరిస్థితులున్నాయి
  • పశ్చిమబెంగాల్‌లో పరిస్థితి దురదృష్టకరం
పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దురదృష్టకరమని, ప్రధాని మోదీ ఓవరాక్షన్‌ వల్లే ఇటువంటి దుస్థితి నెలకొందని మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవెగౌడ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా ఎమర్జెన్సీ నాటి కంటే ఘోరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని వ్యాఖ్యానించారు.

బెంగాల్‌లో పరిణామాలు, అక్కడి సీఎం మమతా బెనర్జీ దీక్ష నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారాలను దుర్వినియోగం చేస్తూ తీసుకుంటున్న ఇటువంటి చర్యలు భవిష్యత్తులో మోదీకి ఏ మాత్రం ఉపకరించవని మండిపడ్డారు.
West Bengal
Narendra Modi
devagouda

More Telugu News