SPBalu: ప్రముఖ గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం

  • ఆమె వయసు 89 సంవత్సరాలు
  • నెల్లూరు జిల్లా తిప్పరాజువారి వీధి నివాసంలో కన్నుమూత
  • ప్రస్తుతం లండన్‌లో ఉన్న బాలు
సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం మాతృమూర్తి శకుంతలమ్మ ఈ రోజు మరణించారు. నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న స్వగృహంలో ఆమె కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు.

 ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం లండన్‌లో ఉన్నారు. కచేరీ కార్యక్రమాల నిమిత్తం లండన్‌కు వెళ్లిన బాలు తల్లి మరణించిందన్న సమాచారం తెలియగానే హుటాహుటిన ఇండియాకు ప్రయాణమయ్యారు. ఈరోజు సాయంత్రం కల్లా ఆయన స్వస్థలానికి చేరుకుంటారని భావిస్తున్నారు. మంగళవారం నెల్లూరులో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
SPBalu
mother died
Nellore District

More Telugu News