West Bengal: పట్టువీడని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. రాత్రంతా దీక్ష!

షార్ట్స్‌లో చూడండి
సీబీఐ దాడులను నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో విచారణకు గాను కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకునేందుకు నిన్న సీబీఐ అధికారులు రాగా వారిని స్థానిక పోలీసులు అడ్డుకోవడం వంటి ఘటనలతో ఆదివారం అంతా టెన్షన్‌ నెలకొన్న విషయం తెలిసిందే.

ఎటువంటి వారంట్‌ కూడా లేకుండా సీబీఐ అధికారులు నిబంధనలు అతిక్రమించారని, కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇది జరుగుతోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమత ఆదివారం రాత్రి దీక్ష ప్రారంభించారు. ఆమె రాత్రంతా మేల్కొనే ఉన్నారు. సీబీఐ రాకతో కేంద్రానికి, మమతా బెనర్జీకి మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఇది ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
Go Back to Shorts
West Bengal
mamatha
cbi

More Telugu News