Hyderabad: కూకట్‌పల్లి బస్టాప్ సమీపంలో జోరుగా వ్యభిచారం.. 27 మంది అరెస్ట్

  • భాగ్యనగర్ కాలనీ బస్టాప్‌లో మహిళల తిష్ఠ
  • ప్రయాణికులకు వేధింపులు
  • న్యాయస్థానం ఆదేశాలతో జైలుకి తరలింపు 
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీ బస్టాప్‌ను అడ్డాగా చేసుకుని వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు దందా జోరుగా సాగుతోందన్న సమాచారంతో నిఘా వేసిన పోలీసులు 27 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ న్యాయస్థానంలో హాజరు పరిచి అనంతరం జైలుకు తరలించినట్టు కూకట్‌పల్లి ఎస్ఐ నారాయణసింగ్ తెలిపారు. ఇకపైనా దాడులు కొనసాగుతాయని, బస్టాపులను అడ్డాగా చేసుకుని ప్రయాణికులను వేధిస్తే ఊరుకునేది లేదని ఎస్సై హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
Hyderabad
Kukatpally
prostitution
Bus stop
Police
women

More Telugu News