బట్టతల ఉన్న వారికి జుట్టు తెప్పిస్తానన్న మోదీ!: తేజస్వీ యాదవ్ సెటైర్లు
- పాట్నాలో నిర్వహించిన జన్ ఆక్రోశ్ ర్యాలీ
- 2014లో ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయలేదు
- అధికారంలో కొస్తే బట్టతలపై జుట్టు తెప్పిస్తామన్న మోదీ
2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. బట్టతల ఉన్న వారికి దువ్వెనలు అమ్మిన ఘనత మోదీదని, జుట్టు లేని తమకెందుకు దువ్వెనలు అమ్ముతున్నారని వారు ప్రశ్నిస్తే, తాము అధికారంలోకి రాగానే బట్టతలపై జుట్టు తెప్పిస్తామని చెప్పి దువ్వెనలు అమ్మిన మోదీ మంచి సేల్స్ మెన్ అని సెటైర్లు విసిరారు.
దేశంలో నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని.. మోదీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. మోదీ అసలు రంగు గురించి బీహార్ నిరుద్యోగులకు తెలియజెప్పేందుకే రాహుల్ ఈ ర్యాలీలో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు.