delhi: ఐదేళ్లకు పైబడి ప్రభుత్వం కొనసాగితేనే అభివృద్ధి సాధ్యం: అమిత్ షా

  • ‘భారత్ మన్ కీ బాత్..’ పేరిట ఎన్నికల ప్రచారం 
  • ‘పని చేసే వారి పైనే ప్రజలు నమ్మకం ఉంచుతారు’
  • ప్రజల ఆశలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో ఉంటుంది
ఐదేళ్లకు పైబడి ప్రభుత్వం కొనసాగితే అభివృద్ధి సాధ్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఢిల్లీలో బీజేపీ ‘సంకల్ప్ పాత్రా’ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ‘భారత్ మన్ కీ బాత్.. మోదీ కే సాత్’ పేరిట లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘పని చేసే వారి పైనే ప్రజలు నమ్మకం ఉంచుతారు’ అనే నినాదంతో ఈ ప్రచారంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు. 

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, తమ కార్యకర్తలకు సంబంధించి ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య వేడుక అని అన్నారు. ప్రజలను కలిసేందుకు కార్యకర్తలకు లభించిన ఓ మంచి అవకాశమిదని, మన ఆలోచనలను ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. దేశ ప్రజల ఆశలను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని, మేనిఫెస్టో రూపొందించే నిమిత్తం ప్రతి రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. ప్రజలు తమ సలహాలను ఓ పేపర్ పై రాసి తెలియజేయాలని, ఇందుకోసం, ఏర్పాటు చేసే బాక్సుల్లో వాటిని వేయాలని సూచించారు. అలాగే, ఈ-మెయిల్, కాల్ సెంటర్ల ద్వారా కూడా ప్రజల సలహాలను సేకరిస్తామని అమిత్ షా పేర్కొన్నారు.
delhi
bjp
amithshah
sankalp patra

More Telugu News