costal bank: నేడు హైదరాబాద్‌లో జయరాం అంత్యక్రియలు... నగరానికి చేరిన కుటుంబ సభ్యులు

  • హత్యకు గురైన కోస్టల్‌ బ్యాంక్‌  డైరెక్టర్‌ జయరాం
  • అమెరికాలో ఉంటున్న ఆయన కుటుంబం
  • ఈ ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న భార్య, పిల్లలు
హత్యకు గురైన పారిశ్రామికవేత్త, కోస్టల్‌ బ్యాంక్‌  డైరెక్టర్‌ చిగురుపాటి జయరాం అంత్యక్రియలు నేడు హైదరాబాద్‌ నగరంలో జరగనున్నాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న జయరాం హత్యకు గురైన విషయం తెలిసిందే. వ్యాపార లావాదేవీలు, ఇతరత్రా కారణాలే ఈ హత్యకు కారణమన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరోవైపు శనివారం పోస్టుమార్టం పూర్తిచేసి జయరాం మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. అమెరికాలో నివాసం ఉంటున్న జయరాం భార్య పద్మశ్రీ, కుమారుడు సాయిశ్రీ, కుమార్తె కావ్యశ్రీలు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహానికి చేరుకున్నారు. దీంతో జయరాం అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
costal bank
chigurupati jayaram
crimation today

More Telugu News