manohar parrikar: ముక్కులో పైప్ పెట్టుకుని... అసెంబ్లీకి వెళ్లొద్దు: పారికర్ పై కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రెజినాల్డో లారెస్కో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముక్కులో పైప్ పెట్టుకుని అసెంబ్లీకి రావడం బాగోలేదని... అది మీకు సూట్ కాలేదని చెప్పారు. ఇకనైనా సీఎం పదవి నుంచి గౌరవంగా తప్పుకోవాలని... ఆరోగ్యంపై దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించారు. ఈ నేపథ్యంలో, రెజినాల్డో వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గోవాలో ప్రభుత్వం సజావుగా సాగుతుండడాన్ని చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని... అందుకే మైండ్ గేమ్ కు దిగుతోందని విమర్శించింది.

ముక్కులో పైప్ తోనే గోవా అసెంబ్లీలో పారికర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖను కూడా పారికర్ తన వద్దే ఉంచుకున్నారు. మరోవైపు, క్లోమ సంబంధిత వ్యాధితో పారికర్ బాధపడుతున్నారు. న్యూయార్క్, ఢిల్లీ, ముంబై, గోవాల్లో ఆయన చికిత్స తీసుకున్నారు.
Go Back to Shorts
manohar parrikar
goa
cm
congress
bjp

More Telugu News