sarathbabu: రమాప్రభకి చాలా ఆస్తి ఇచ్చాను.. ఇప్పుడు దాని విలువ 60 కోట్లు!: శరత్ బాబు

  • ప్రపంచంపై అవగాహన లేని వయసులో రమాప్రభను పెళ్లి చేసుకున్నా
  • మాది వివాహం కాదు.. కలయిక మాత్రమే
  • రమాప్రభను మోసం చేశానన్నది తప్పుడు ప్రచారమే
ఏమీ తెలియని వయసులో కాలేజీ నుంచి ఫ్రెష్ గా తాను సినిమా రంగంలోకి అడుగుపెట్టానని ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు తెలిపారు. 22 ఏళ్ల వయసులో ప్రపంచంపై ఎలాంటి అవగాహన లేని వయసులో తాను తీసుకున్న నిర్ణయం తన జీవితంపై అమితమైన ప్రభావాన్ని చూపిందని చెప్పారు. తన కంటే ఐదారేళ్లు పెద్దదైన రమాప్రభను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తమ మధ్య జరిగింది వివాహం కాదని... ఒక కలయిక మాత్రమేనని అన్నారు.

రమాప్రభను తాను మోసం చేశానని, ఆమె ఆస్తులను కాజేశానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. తన పేరుపై ఉన్న ఒక ఆస్తిని అమ్మి... రమాప్రభ, ఆమె సోదరుడి పేర్లపై మూడు ఆస్తులను కొన్నానని... ఇప్పుడు ఆ ఆస్తి విలువ దాదాపు రూ. 60 కోట్లు ఉంటుందని తెలిపారు. చెన్నైలోని ఉమాపతి స్ట్రీట్ లో తాను మరొక ఆస్తి కొనిచ్చానని... దాని విలువ కూడా కొన్ని కోట్లు ఉంటుందని చెప్పారు. వీటికి సంబంధించి ఎవరైనా సరే రికార్డులను చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
sarathbabu
tollywood
ramaprabha
assets

More Telugu News