Sharmila: షర్మిల కేసులో నిందితుడి అరెస్ట్!

  • అప్రదిష్టపాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు
  • గుంటూరులో వ్యక్తి అరెస్ట్
  • హైదరాబాద్‌కు తరలింపు
వైసీపీ మహిళా నేత షర్మిల కేసు విచారణలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పురోగతి సాధించారు. కొద్ది రోజుల క్రితం షర్మిల తనను సోషల్ మీడియా వేదికగా అప్రదిష్ట పాలు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి గుంటూరులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడిపై సెక్షన్ 509 ఐపిసి, 67 ఐటి యాక్ట్ కింద కేసు నమోదు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
Sharmila
Cyber Crime Police
Social Media
Guntur
Hyderabad

More Telugu News