96 movie: దర్శకుడికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కానుకగా ఇచ్చిన విజయ్ సేతుపతి!

  • ఘన విజయం సాధించిన ‘96’
  • తెలుగులో రీమేక్ చేస్తున్న దిల్ రాజు
  • తెలుగులోనూ ప్రేమ్ కుమారే దర్శకుడు
ఆమధ్య విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ సినిమా ‘96’ ఘన విజయం సాధించింది. స్కూలు వయసులో ప్రేమలు ఎలా ఉంటాయి? వాటిని ఒకరికొకరు చెప్పుకోలేక విడిపోవడం.. పెరిగి పెద్దయ్యాక రీయూనియన్ ద్వారా కలుసుకున్నప్పుడు వారి మనోభావాలు ఎలా ఉంటాయి? తదితర విషయాలను ఈ సినిమాలో దర్శకుడు చాలా చక్కగా చూపించాడు.

ఈ ‘96’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భంగా విజయ్ సేతుపతి.. దర్శకుడు ప్రేమ్ కుమార్‌కి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను రిజిస్ట్రేషన్ చేయించి మరీ కానుకగా ఇచ్చారు. ప్రేమ్‌కుమార్‌కి విజయ్ బైక్ అందజేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలావుంచితే, ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేసేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నారు. తమిళ్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
96 movie
Vijay Sethupathi
Trisha
Dil Raju
Tamil
Prem kumar

More Telugu News