Vijayawada: రేపు అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభం

  • విజయవాడ చేరుకున్న సీజేఐ, న్యాయమూర్తులు
  • వారికి ఘనస్వాగతం పలికిన హైకోర్టు రిజిస్ట్రార్లు
  • సీజేఐను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రులు
రేపు అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి విజయవాడ చేరుకున్నారు. స్థానిక నోవాటెల్ హోటల్ లో వారికి హైకోర్టు రిజిస్ట్రార్లు ఘనస్వాగతం పలికారు. సీజేఐ రంజన్ గొగొయ్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా సీజేఐను ఏపీ మంత్రులు దేవినేని ఉమ, నారాయణ, సీఎస్ అనిల్ చంద్ర పునేఠ, డీజీపీ ఆర్పీ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు కలిశారు. 
Vijayawada
High Court

More Telugu News