West Bengal: పశ్చిమ బెంగాల్ లో మోదీ సభలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు!

  • ఠాకూర్ నగర్ లో బీజేపీ భారీ బహిరంగ సభ
  • వేదికకు దగ్గరగా వెళ్లిన వందలాది మద్దతుదారులు 
  • మోదీ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట  
పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన ప్రధాని మోదీ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్తర 24 పరిగణాల జిల్లాలోని ఠాకూర్ నగర్ లో బీజేపీ భారీ బహిరంగ సభ ఈ రోజు జరిగింది. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో వందలాది మంది బీజేపీ మద్దతుదారులు వేదికకు దగ్గరగా రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

కాగా, ఈ ఘటన నేపథ్యంలో మోదీ తన ప్రసంగ సమయాన్ని కుదించుకున్నారు. కేవలం, పద్నాలుగు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని మోదీ ముగించేశారు. మరో ర్యాలీలో పాల్గొనాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, వేదిక వద్దకు వందలాది బీజేపీ మద్దతుదారులు వెళుతున్న సమయంలో, రావొద్దని మోదీ వారికి సూచించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
West Bengal
pm
modi

More Telugu News