Chandrababu: ఆటోను నడిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఫొటోలు ఇవిగో
- ఆటోలపై జీవితకాల పన్ను రద్దు
- ఇంధన ఛార్జీలు, ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు
- కృతజ్ఞతలు తెలిపిన ఆటో డ్రైవర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు ఆఫీస్ ఆవరణలో స్వయంగా ఆటో నడిపారు. ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేయడమే కాకుండా ఇంధన ఛార్జీలు, ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటానని, ఆటో డ్రైవర్లందరికీ పెద్దన్నగా తానుంటానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేసిన నేపథ్యంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.