NTR: ఎన్టీఆర్ తెరపై మాత్రమే నటిస్తే, చంద్రబాబు నిజ జీవితంలో నటిస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి

  • చంద్రబాబుపై సుబ్బారెడ్డి విమర్శలు
  • నిన్న అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు కొత్త డ్రామా
  • కేంద్ర బడ్జెట్ తో పేదలకు ఎటువంటి ప్రయోజనం లేదు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెరపై మాత్రమే నటించారని, చంద్రబాబు మాత్రం నిజ జీవితంలో కూడా నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీకి అన్యాయం చేసిన కేంద్రాన్ని, బీజేపీ నేతలను చూస్తుంటే తన రక్తం ఉడికిపోతోందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ గురించి ఆయన మాట్లాడుతూ, ఈ బడ్జెట్ తో పేదలకు ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు.
NTR
Chandrababu
Telugudesam
YSRCP
yv subba reddy

More Telugu News