Andhra Pradesh: కొందరు సర్వేలు చూసి సంబరపడిపోతున్నారు: చంద్రబాబు

  • తప్పుడు సర్వేలతో మభ్య పెట్టాలని చూస్తున్నారు
  • కుట్రలు, కుతంత్రాలు చేసే వారికి తగిన బుద్ధి చెప్పాలి
  • ఏపీ కోసం, ప్రజల కోసం ఐదేళ్లుగా శ్రమించా
కొందరు సర్వేలు చూసి సంబరపడిపోతున్నారని, తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. కృష్ణా జిల్లాలోని కేసరిపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుట్రలు, కుతంత్రాలు చేసే వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఏపీ కోసం, ప్రజల కోసం ఐదేళ్లుగా శ్రమించానని చెప్పారు. ‘పట్టిసీమ’ను వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు ఇచ్చామని, ‘చంద్రన్న బాట’ పథకం కింద ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేశామని, రూ.83 వేల కోట్ల ఖర్చుతో 23 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, కాపులకు రిజర్వేషన్లు కల్పించి ఎవ్వరూ చేయని సాహసం చేశానని అన్నారు. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు.
Andhra Pradesh
cm
Chandrababu
Krishna District

More Telugu News