vijay devarakonda: తెలుగులో 'ద్వారక' .. తమిళంలో 'అర్జున్ రెడ్డి'

  • పరాజయంపాలైన 'ద్వారక'
  • 'నోటా'తో తమిళ ఆడియన్స్ కి దగ్గరగా
  • తమిళనాట పెరుగుతోన్న క్రేజ్    
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'అర్జున్ రెడ్డి' తెలుగునాట సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఆయన తెలుగుతోపాటు తమిళంలోను 'నోటా' చేసి .. అక్కడివారి మనసులను గెలుచుకున్నాడు.

తమిళనాట కూడా విజయ్ దేవరకొండకి క్రేజ్ పెరుగుతూ ఉండటంతో, గతంలో ఆయన తెలుగులో చేసిన సినిమాను అక్కడ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో 'అర్జున్ రెడ్డి'కి ముందు విజయ్ దేవరకొండ చేసిన 'ద్వారక' సరిగ్గా ఆడలేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమాను అక్కడ 'అర్జున్ రెడ్డి' పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళనాట విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కి ఇదొక నిదర్శనమేనని చెప్పాలి. ఇక అక్కడ 'అర్జున్ రెడ్డి' రీమేక్ గా రూపొందిన 'వర్మ' ఈ నెల 15వ తేదీన ప్రేక్షకులముందుకు రానుంది. 
vijay devarakonda

More Telugu News