shankar: 'భారతీయుడు 2'కి తనని తీసుకోకపోవడం పట్ల ఏఆర్ రెహ్మాన్ స్పందన

  • కమల్ నాకు ప్రాధాన్యతనిచ్చారు
  • శంకర్ .. అనిరుధ్ కి ఛాన్స్ ఇచ్చారు
  • వేరే కారణాలంటూ ఏమీ లేవు
శంకర్ .. ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని నమోదు చేసింది. కథా కథనాల పరంగానే కాదు సంగీతం పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టేసింది. సంగీతం ఈ సినిమాను ఒక స్థాయిలో నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో 'భారతీయుడు 2'కి కూడా ఏఆర్ రెహ్మాన్ పనిచేస్తాడని అంతా భావించారు.

అయితే శంకర్ .. అనిరుధ్ ను తీసుకున్నాడు. శంకర్ ఇలా చేయడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై రెహ్మాన్ స్పందించాడు. 'భారతీయుడు 2'కి నేనే పనిచేయాలని కమల్ భావించారు .. కానీ శంకర్ తనకి నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. ఒకే కాంబినేషన్లో వరుస సినిమాలు చేయడం బోరింగ్ గా ఉంటుందని ఆయన భావించి వుంటారు. '2.ఓ' సినిమా కోసం నేను చాలా అలసిపోయాను. అందువలన నన్ను మరింత కష్టపెట్టకూడదని ఆయన అనుకుని వుంటారు. అంతేతప్ప వేరే కారణాలేమీ లేవు" అంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. 
shankar
rehman

More Telugu News