Pawan Kalyan: జనసేన మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసిన పవన్

  • చైర్ పర్సన్‌గా రేఖ నియామకం
  • ఆడిటర్‌గా పనిచేస్తున్న రేఖ
  • మహిళలకు సముచిత స్థానం
జనసేన పార్టీని పటిష్టం చేసేందుకు గాను గతంలో యువజన, విద్యార్థి సంఘాల నిర్మాణాలను చేపట్టిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి జనసేన వీర మహిళా సంఘంగా నామకరణం చేసి.. జవ్వాని రేఖను చైర్ పర్సన్‌గా నియమించారు.

కర్నూలు జిల్లాకు చెందిన రేఖ ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆమె పార్టీలోకి వచ్చారని సమాచారం. జనసేన విజన్, మ్యానిఫెస్టో అంశాలను ఆమె విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని.. అందువల్ల ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. బీసీ సమాజానికి చెందిన రేఖను చైర్ పర్సన్‌గా నియమించటం ద్వారా మహిళలకు సముచిత స్థానం కల్పించినట్టు పార్టీ నేతలు వెల్లడించారు.
Pawan Kalyan
Janasena
Javvani Rekha
Auditor
chair Person

More Telugu News