KTR: కేటీఆర్‌ను కలిసిన అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా

  • విద్యార్థుల సమస్యపై మాట్లాడిన కేటీఆర్
  • బయటపడేందుకు సహకరించాలని వినతి
  • వ్యాపార, వాణిజ్యాలపై చర్చ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నేడు అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా హైదరాబాదు, ప్రగతి భవన్‌లో కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌కి కేథరిన్ అభినందనలు తెలిపారు.

రాజకీయాల్లో చొరవ, ఉత్సాహం చూపించే కేటీఆర్‌కు ఈ పదవి సరిగ్గా సరిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమెరికాలో నకిలీ యూనివర్సిటీ సంక్షోభంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు సమస్య నుంచి బయటపడేందుకు సహకరించాలని కేథరిన్‌ను కేటీఆర్ కోరారు. అలాగే తెలంగాణతో అమెరికాకు సంబంధించిన వ్యాపార వాణిజ్యాలపై చర్చించినట్టు కేథరిన్ మీడియాకు తెలిపారు.
KTR
Catherine Hadda
America
Pragathi Bhavan
Telangana
Students

More Telugu News