Uttar Pradesh: స్కూలులోకి ఆవులను తోలిన గ్రామస్తులు.. 80 మందిపై కేసులు పెట్టిన పోలీసులు!

  • యూపీలోని ఉస్రాహర్ లో ఘటన
  • విద్యార్థులకు అసౌకర్యంతో అదనపు మేజిస్ట్రేట్ ఆగ్రహం
  • కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
పాఠశాలకు విద్యార్థులు వెళ్లకూడదనో, మరో కారణంతోనో కొందరు వ్యక్తులు స్కూలు భవనంలోకి ఆవులను తోలారు. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇందుకు కారకులైన పలువురిని పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

యూపీలోని ఉస్రాహర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి కొందరు ఆవులను తోలారు. దీంతో విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జితేంద్రకుమార్ కుహ్వాహా దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 80 మందిపై కేసు నమోదు చేశారు. పాఠశాలల్లోకి ఆవులను తోలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Uttar Pradesh
school
cows
Police
angry
80 people case

More Telugu News