Hyderabad: మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు, జరిమానా

  • టీఎస్‌ఆర్‌టీసీలో మహిళా కండక్టర్‌కు, తోటి మహిళలకు వేధింపులు
  • బస్సు నిలిపి పోలీసులకు ఫిర్యాదు చేసిన కండక్టర్‌
  • 3 రోజుల జైలు, రూ.వంద జరిమానా విధింపు
మద్యం మత్తులో టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఎక్కిన ఓ ప్రబుద్ధుడు మహిళా కండక్టర్‌తోపాటు తోటి మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో న్యాయమూర్తి మూడు రోజుల జైలు, రూ.వంద జరిమానా విధించారు. కంచన్‌బాగ్‌ పోలీసు ఠానా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు. బాలాపూర్‌ ప్రాంతానికి చెందిన పి.శ్రీనివాస్‌గౌడ్‌ ఇటీవల బస్సు ఎక్కాడు. మద్యం మత్తులో ఉన్న అతను మహిళా కండక్టర్ తో పాటు వారించిన ఇతర మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం హైదరాబాద్‌ ఏడో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ముందు హాజరు పరిచారు. కేసు విచారించిన న్యాయమూర్తి ఈ విధంగా తీర్పు చెప్పారు.
Hyderabad
tsrtc
convict for misbehavior

More Telugu News