Meda Mallikarjun: టీడీపీ ఎమ్మెల్యే మేడా రాజీనామాను ఆమోదించిన స్పీకర్ కోడెల

  • నిన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మేడా
  • మేడాతో మాట్లాడిన స్పీకర్
  • ఆపై రాజీనామాకు ఆమోదం
రాజంపేట ఎమ్మెల్యే, నిన్న వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మేడా మల్లికార్జున్ రాజీనామాను కొద్దిసేపటి క్రితం స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమోదించారు. గత వారంలోనే మేడా తన రాజీనామాను స్పీకర్ కార్యాలయానికి అందించిన సంగతి తెలిసిందే. రాజీనామాను ఆమోదించే ముందు మేడాతో ఫోన్ లో మాట్లాడిన కోడెల, ఆమోదంపై ఆయన అభిప్రాయాన్ని తీసుకున్నారని స్పీకర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా, తన పార్టీలో చేరాలంటే, ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వైఎస్ జగన్ సూచించారని, దాంతో తాను రాజీనామా చేసే వచ్చానని నిన్న మేడా వ్యాఖ్యానించారు.
Meda Mallikarjun
Rajampeta
Kodela
Resign

More Telugu News