bjp: ఆ విషయంలో జగన్ నిష్ణాతుడు: చంద్రబాబు

  • ద్రోహులతో ఒకవైపు, నేరస్థులతో మరోవైపు పోరాటం
  • నేరస్థుల మైండ్ గేమ్ విభిన్నంగా ఉంటుంది
  • పార్టీ నేతలతో చంద్రబాబు
ఏపీకి అన్యాయం చేసిన ద్రోహులతో ఒకవైపు, నేరస్థులతో మరోవైపు మనం పోరాడుతున్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని తమ నేతలకు సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేరస్థుల మైండ్ గేమ్ విభిన్నంగా ఉంటుందని, ఆ విషయంలో జగన్ నిష్ణాతుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రెండేళ్లుగా అసెంబ్లీకి రాని వాళ్లు బహుశ వీరు తప్ప ప్రపంచ చరిత్రలో మరెవరూ ఉండరేమోనంటూ వైసీపీని విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ గురించి ప్రస్తావిస్తూ ఏపీలో బీజేపీకి ఏమాత్రం బలం లేదని, వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా ఆ పార్టీకి 0.5 శాతం ఓట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అసలు, ఆ పార్టీ గురించి ప్రస్తావించడమంటే తమ సమయం వృథా చేసుకోవడమేనని సెటైర్లు విసిరారు.
bjp
YSRCP
Telugudesam
Chandrababu
Jagan

More Telugu News