Maharshi: ‘మహర్షి’పై వస్తున్న రూమర్లపై స్పందించిన దిల్ రాజు

  • మహేశ్ కథానాయకుడిగా ‘మహర్షి’
  • కథానాయికగా నటిస్తున్న పూజా హెగ్డే
  • ఏప్రిల్ 25న విడుదల
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ని వేసవి కానుకగా ఏప్రిల్ 25న విడుదల చేయనున్నామని చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ రూమర్లు రావడంతో దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పూ లేదని ఆయన తెలిపారు.
Maharshi
Mahesh babu
Puja Hegde
Dil Raju
Aswini Dutt
PVP

More Telugu News