Andhra Pradesh: మోదీ నాకు జూనియర్.. అయినా 10 సార్లు ‘సార్’ అని పిలిచాను!: సీఎం చంద్రబాబు

  • ఏపీ ప్రయోజనాల కోసం తగ్గాను
  • బిల్ క్లింటన్ ను కూడా సార్ అనలేదు
  • బీజేపీతో పొత్తు లేకుంటే ఇంకో పది సీట్లు వచ్చేవి
ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల్లో తనకు జూనియర్ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయినప్పటికీ మోదీ అహాన్ని సంతృప్తి పర్చడానికి ‘సార్’ అని పిలిచేవాడినని చెప్పారు. మోదీని ఇప్పటివరకూ 10 సార్లు సార్ అని పిలిచిఉంటానని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అప్పట్లో భారత్ కు వచ్చినప్పుడు తాను ఆయన్ను ‘మిస్టర్ క్లింటన్’ అని మాత్రమే పిలిచానని గుర్తుచేసుకున్నారు.

కేవలం ఏపీ ప్రయోజనాల కోసమే మోదీని సార్ అని సంబోధించానని చంద్రబాబు తెలిపారు. 2014లో ఏపీకి న్యాయం చేస్తారన్న నమ్మకంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, ఒకవేళ పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే మరో 10 అసెంబ్లీ స్థానాలను అధికంగా గెలిచేవాళ్లమని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Narendra Modi
BJP
bill clinton
10 times sir

More Telugu News