modi: మోదీని నిలదీసే ధైర్యం జగన్ కు ఎక్కడుంది?: చంద్రబాబు

  • బీజేపీతో కలసి వైసీపీ, టీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి
  • కేసీఆర్, జగన్ లను మోదీ ప్రోత్సహిస్తున్నారు
  • మోదీ తీరు నచ్చకే అన్నా హజారే మళ్లీ దీక్ష చేస్తున్నారు
రాష్ట్రానికి న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా... తమపై బీజేపీ దాడి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో కూడా అందరూ వ్యక్తపరిచారని చెప్పారు. బీజేపీతో కలసి వైసీపీ, టీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలను చేస్తున్నాయని విమర్శించారు. ఓవైపు కేసీఆర్, మరోవైపు జగన్ ఇద్దరూ కలసి ఏపీకి అన్యాయం చేస్తున్నారని అన్నారు. వీరిద్దరినీ ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

అసలు మోదీ తీరు సరిగా లేకపోవడం వల్లే సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మళ్లీ నిరాహార దీక్ష చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. మోదీ నిరంకుశ వైఖరి నచ్చక జాతీయ గణాంకాల కమిషన్ లో ఇద్దరు సభ్యులు రాజీనామా చేశారని చెప్పారు. మోదీని నిలదీసే ధైర్యం జగన్ కు ఎక్కడుందని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను అణచివేసేందుకు బీజేపీ యత్నిస్తోందని దుయ్యబట్టారు.
modi
Chandrababu
kcr
jagan
bjp
Telugudesam
TRS
ysrcp

More Telugu News