India: 92 పరుగులకే టీమిండియా ఆలౌట్!

  • బౌల్ట్ కు దక్కిన 5 వికెట్లు
  • ఇద్దరు భారత ఆటగాళ్లు డక్కౌట్
  • న్యూజిలాండ్ ముందు 93 పరుగుల విజయలక్ష్యం
విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీల గైర్హాజరులో న్యూజిలాండ్ తో నాలుగో వన్డేలో తలపడిన టీమిండియా పేలవమైన ఆటతీరును కనబరుస్తూ, 92 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్లలో కనీసం ఒక్కరైనా 20 పరుగుల మార్క్ ను అందుకోలేదు. ఇద్దరు అసలు పరుగుల ఖాతా తెరవకుండానే పెవీలియన్ కు చేరారు. రోహిత్ శర్మ 7, ధావన్ 13, శుభమన్ గిల్ 9, అంబటి రాయుడు 0, దినేష్ కార్తీక్ 0, కేదార్ జాదవ్ 1, హార్దిక్ పాండ్యా 16, భువనేశ్వర్ కుమార్ 1, కులదీప్ 15, ఖలీల్ 5 పరుగులు చేయగా, చాహాల్ 18 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ కు 5 వికెట్లు దక్కగా, గ్రాండ్ హోమ్ కు 3, ఆస్ట్లే, నీషామ్ లకు చెరో వికెట్ దక్కాయి. మరికాసేపట్లో 93 పరుగుల సునాయాస లక్ష్యంగా న్యూజిలాండ్ లక్ష్య ఛేదన ప్రారంభించనుంది.
India
Newjeland
Hamilton
Cricket

More Telugu News