Andhra Pradesh: ఏపీలోని 25 ఎంపీ సీట్లలో 23 వైఎస్ఆర్ కాంగ్రెస్ వే!: టైమ్స్ నౌ - వీఎంఆర్ తాజా సర్వే

  • ఏపీలో తిరుగులేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
  • తెలుగుదేశం పార్టీకి దక్కేది 2 సీట్లే
  • ఎన్డీయే, యూపీఏలకు ఖాతా తెరిచే చాన్స్ లేదు
ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలు జరిగితే, వైఎస్సార్ కాంగ్రెస్ కు తిరుగులేదని టైమ్స్ నౌ - వీఎంఆర్ సర్వే పేర్కొంది. మొత్తం 25 లోక్ సభ స్థానాలకుగాను 23 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుందని, తెలుగుదేశం పార్టీకి రెండు సీట్లు మాత్రమే దక్కుతాయని, ఎన్డీయే, యూపీఏలకు ఖాతా తెరిచే అవకాశాలు కూడా లేవని చెప్పింది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే, వైసీపీకి 49.5 శాతం, టీడీపీకి 36 శాతం, ఎన్డీయేకు 4.8 శాతం, యూపీఏకు 2.5 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. కాగా, గడచిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయేకు 17 (టీడీపీకి 15, బీజేపీకి 2), వైసీపీకి 8 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh
YSRCP
Telugudesam
NDA
UPA

More Telugu News