Lokpal: లోక్‌పాల్, లోకాయుక్త నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ.. మరోసారి దీక్షకు దిగిన అన్నా హజారే

  • లోక్‌పాల్ బిల్లు 2013లో ఆమోదం
  • ఏ పార్టీ పట్టించుకోవట్లేదు
  • రాలేగావ్ సిద్దిలో దీక్ష
లోక్‌పాల్, లోకాయుక్తలను నియమించే వరకూ దీక్ష విరమించేది లేదని పేర్కొంటూ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు దిగారు. లోక్‌పాల్ బిల్లు 2013లో పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ.. నేటి వరకూ లోక్‌పాల్, లోకాయుక్త నియామకాల్లో జాప్యం వహించడాన్ని ఆయన తీవ్రంగా నిరసిస్తున్నారు.

అసలు ఏ పార్టీ దీని గురించి పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం మహారాష్ట్రలోని అన్నా హజారే తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో నిరాహార దీక్ష చేపట్టారు. లోక్‌పాల్, లోకాయుక్తలను నియమించే వరకూ తాను దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.
Lokpal
Lokayuktha
Parliament
Anna Hazare
Maharashtra
Ralegav siddi

More Telugu News