team india: ఊరిస్తున్న రికార్డు: 52 ఏళ్లలో సాధించలేనిదాన్ని టీమిండియా రేపు సాధిస్తుందా?

  • కివీస్ గడ్డపై 3-1 తేడాతో గెలవడమే ఇప్పటి వరకు టీమిండియా రికార్డు
  • రేపు గెలిస్తే 4-0 ఆధిక్యం
  • కోహ్లీ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్న రోహిత్
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. 5 వన్డేల సిరీస్ ను ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ను ఓ రికార్డు ఊరిస్తోంది. 1967 నుంచి న్యూజిలాండ్ లో భారత్ పర్యటిస్తోంది. ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. అది కూడా 2008-09 పర్యటనలో. రేపు జరగనున్న వన్డేలో గెలిస్తే కివీస్ గడ్డపై 4-0 తేడాతో గెలుపొంది, అత్యుత్తమ రికార్డును సొంతం చేసుకుంటుంది. రేపు ఉదయం 7.30 గంటలకు హామిల్టన్ లో నాలుగో వన్డే జరగనుంది. చివరి రెండు వన్డేలకు కోహ్లీ దూరం కావడంతో... అతని స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నాడు.
team india
new zealand
odi
hamilton

More Telugu News