Andhra Pradesh: పరీక్షల్లో కాపీ కొడితే డీబార్ చేస్తారు.. జగన్ హామీలను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలి?: రోజా

  • చంద్రబాబు కాలం చెల్లిన మాత్ర
  • వైఎస్ జగన్ అప్ డేటెడ్ వెర్షన్
  • తెలికిచర్లలో ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాలం చెల్లిన మాత్ర లాంటి వ్యక్తి అయితే.. జగన్ అప్ డేటెడ్ వెర్షన్ అని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్ పథకాలను కాపీ కొడుతున్నారని దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లాలోని నల్లజెర్ల మండలం, తెలికిచర్ల గ్రామంలో ఈరోజు జరిగిన ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. పరీక్షల్లో కాపీ కొడితే డీబార్ చేస్తారనీ, అలాంటప్పుడు జగన్ హామీలను కాపీ కొడుతున్న చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. 
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
schemes
roja
ninnu nammam babu

More Telugu News