Andhra Pradesh: చంద్రబాబు అవినీతి ‘కియా’.. భూ మాఫియాకు సపోర్ట్ ‘కియా’!: బీజేపీ నేత జీవీఎల్

  • కేంద్రం కృషిని బాబు హైజాక్ చేశారు
  • ఏపీకి మోదీ న్యాయం చేశారు
  • ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ నేత
బీజేపీ అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు కియా కంపెనీ పేరుతో కేంద్ర ప్రభుత్వ కృషిని హైజాక్ చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా భూ మాఫియాకు మద్దతు పలికారనీ, అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు.

ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కియా అంటే హిందీలో "చేశారు" అని అర్థం. చంద్రబాబు గారు "కియా" పేరుతో కేంద్రం కృషిని హైజాక్ "కియా"! (చేశారు)
అవినీతి "కియా"! (చేశారు)
పబ్లిసిటీ "కియా"! (చేశారు)
భూ-మాఫియా కు సపోర్ట్ "కియా"..! (చేశారు)!
ఇవన్నీ @ncbn చేస్తే నరేంద్ర మోడీ గారు ఆంధ్రకు కియా ప్రాజెక్ట్ తెచ్చి న్యాయం చేశారు’ అని జీవీఎల్ ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu
kia cars
Anantapur District
BJP
gvl narasimharao
Twitter

More Telugu News