Chandrababu: చంద్రబాబుతో సమావేశానికి విపక్షాలన్నీ గైర్హాజరు!

  • సమావేశానికి రాబోవడం లేదన్న కాంగ్రెస్
  • ఇప్పటికే గైర్హాజరును ప్రకటించిన జనసేన, వైసీపీ
  • నేడు చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్షం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన విపక్షాలన్నీ దూరం కానున్నాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తమ ప్రతినిధులను పంపుతుందని భావించినా, ఆ పార్టీ కూడా సమావేశానికి రావడం లేదని ఈ ఉదయం స్పష్టం చేసింది.

ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ సమావేశానికి తాము రాబోవడం లేదని ప్రకటించగా, ఈ తరహా సమావేశాలు వృథా అని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక వామపక్షాలతో పాటు, బీజేపీ కూడా సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించాయి. ఈ సమావేశంతో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని, ఎన్నికలకు ముందు కేవలం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో అఖిలపక్ష సమావేశాలంటూ హడావిడి చేయడం ఏంటని కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌ ఒక లేఖలో ప్రశ్నించారు.
Chandrababu
All Party Meeting
Congress
YSRCP
Telugudesam
Jana Sena

More Telugu News