West Bengal: అమిత్ షా ర్యాలీకి వచ్చాయట... వాహనాలను నాశనం చేసిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు!

  • ఈస్ట్ మిడ్నాపూర్ లో అమిత్ షా ర్యాలీ
  • పార్కింగ్ చేసిన వాహనాల ధ్వంసం
  • తృణమూల్ పనేనన్న బీజేపీ
పశ్చిమ బెంగాల్ ఈస్ట్ మిడ్నాపూర్ లో జరిగిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీకి హాజరైన పలు వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని బీజేపీ నేత రాహుల్ సిన్హా ఆరోపించారు. ర్యాలీకి సమీపంలో పార్కింగ్ చేసిన వాహనాలనే ధ్వంసం చేశారని, ఇవన్నీ బీజేపీ కార్యకర్తలను సభకు తీసుకు వచ్చిన వాహనాలేనని ఆయన తెలిపారు. ఈ తరహా చర్యలతో తమను భయపెట్టలేరని మరో బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గియా వ్యాఖ్యానించారు. ఇందుకు తగిన మూల్యం మమతా బెనర్జీ చెల్లించుకునే సమయం మరెంతో దూరంలో లేదని హెచ్చరించారు. అంతకుముందు ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ, పౌరసత్వ బిల్లుపై మమతా బెనర్జీ అభిప్రాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.



West Bengal
Mamata Benerjee
Trunamool Congress
Amit Shah

More Telugu News