Snake: తెలంగాణ పోలింగ్ డ్యూటీలో.. మహిళా కానిస్టేబుల్ కు పాము కాటు!

  • ధర్మారం మండలం నందిమేడారంలో ఘటన
  • విధుల్లో బసంతనగర్ పీఎస్ కు చెందిన వనిత
  • పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
తెలంగాణలో ఈ ఉదయం ప్రారంభమైన తుది దశ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ను పాము కాటేసింది. ఈ ఘటన పెద్దపల్లి సమీపంలోని ధర్మారం మండలం నందిమేడారం పంచాయతీ పరిధిలో జరిగింది. విధుల నిమిత్తమై బసంతనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ కు చెందిన మహిళా కానిస్టేబుల్ వనిత, నందిమేడారం గ్రామానికి వచ్చారు. డ్యూటీలో ఉన్న ఆమెను పాము కాటేయడంతో, అప్రమత్తమైన పోలింగ్‌ సిబ్బంది, ఆమెను కరీంనగర్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వనితకు చికిత్స జరుగుతోందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. ఈ ప్రాంతంలో పాములు తిరుగాడటం సర్వసాధారణమని ప్రజలు అంటున్నారు. 
Snake
Telangana
On Duty
Vanita
Lady Conistable

More Telugu News