Chandrababu: చంద్రబాబు తన కోడల్ని మాత్రమే పారిశ్రామికవేత్తగా మార్చారు!: రోజా విసుర్లు

  • చంద్రబాబు ఎక్స్‌పైర్ అయిన ట్యాబ్లెట్
  • వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు
  • లోకేష్‌కి తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదు
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు. నేడు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెర్వులో నిర్వహించిన వైసీపీ మహిళా స్వరం సభలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ఎక్స్‌పైర్ అయిన ట్యాబ్లెట్ అని.. వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు.

అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతీ మహిళను జగన్ ఆదుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో లోకేష్‌కి తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదని.. చంద్రబాబు తన కోడలు బ్రాహ్మణిని మాత్రమే పారిశ్రామికవేత్తగా మార్చారని రోజా విమర్శించారు. డ్వాక్రా మహిళలను అప్పులపాలు చేసిన చంద్రబాబుకు అసలు పసుపు కుంకుమల విలువ తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu
Roja
East Godavari District
Jagan
Lokesh
Brahmini

More Telugu News