Rohit Sharma: ధోనీ సరసన నిలిచిన డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ

  • పరుగుల వరద పారిస్తున్న రోహిత్
  • వన్డేల్లో 215 సిక్సర్లు కొట్టిన డ్యాషింగ్ బ్యాట్స్ మెన్
  • ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్
టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. కఠినమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పిచ్ లపై కూడా రోహిత్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. క్రీజులో కాసేపు నిలదొక్కుకుంటే సిక్సర్లతో విరుచుకుపడటం రోహిత్ నైజం. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో కూడా రోహిత్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో, వన్డేల్లో రోహిత్ కొట్టిన సిక్సర్ల సంఖ్య 215కు చేరుకుంది. ఈ క్రమంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా బ్యాట్స్ మెన్ గా ధోనీ పేరిట ఉన్న రికార్డును రోహిత్ సమం చేశాడు. ధోనీ కూడా వన్డేల్లో ఇప్పటి వరకు 215 సిక్సర్లు బాదాడు.
Rohit Sharma
dhoni
sixers
record
team india

More Telugu News