jagan: జగన్ ను అసెంబ్లీకి ఆహ్వానిస్తా.. కానీ, తనతో మాట్లాడే అవకాశాన్ని జగన్ నాకు ఇవ్వడం లేదు: కోడెల

  • అసెంబ్లీలో అధికార, విపక్షాలు ఉంటేనే స్పీకర్ కు సవాల్ గా ఉంటుంది
  • అసెంబ్లీలో ప్రతిపక్షం లేదనే అసంతృప్తి నాలో ఉంది
  • వైసీపీ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో నాకు తెలియదు
అసెంబ్లీలో ప్రతిపక్షం లేదనే అసంతృప్తి తనలో ఉందని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ ఉంటేనే స్పీకర్ కు సవాల్ గా ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ అధినేత జగన్ ను ఈసారి కూడా పిలుస్తామని తెలిపారు. అయితే, మాట్లాడేందుకు తనకు ఆయన అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. అసెంబ్లీకి వైసీపీ ఎందుకు హాజరు కావడం లేదో తనకు తెలియదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ కు బదులు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోందని... ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టదని తాను భావిస్తున్నానని తెలిపారు.
jagan
kodela
Telugudesam
ysrcp
assembly

More Telugu News