tamil nadu: తమిళనాడులో ఐటీ పంజా.. ఏక కాలంలో 74 చోట్ల సోదాలు

  • చెన్నై, కోయంబత్తూరుల్లో సోదాలు
  • సోదాలు నిర్వహిస్తున్న 150 మంది అధికారులు
  • ఐటీ శాఖకు తప్పుడు లెక్కలు చూపించారనే ఆరోపణలతో తనిఖీలు
తమిళనాడులో ఐటీ శాఖ పంజా విసిరింది. చెన్నై, కోయంబత్తూరు నగరాల్లోని 74 చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. మొత్తం 150 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. శరవణ స్టోర్స్, లోటస్, రేవతి గ్రూప్ లకు చెందిన నగలు, వస్త్ర దుకాణాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఐటీ శాఖకు సమర్పించిన పత్రాల్లో చూపిన లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన లేదనే ఆరోపణలతో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
tamil nadu
it
raids
chennai
coimbathor

More Telugu News