వివాదంలో లేని అయోధ్య భూమిని యజమానులకు అప్పగిస్తాం.. అనుమతివ్వండి: సుప్రీంకోర్టును కోరిన కేంద్రం
- రామ జన్మభూమి వివాదాస్పద ప్రాంతం 2.77 ఎకరాలు
- వివాదంలో లేని భూమి 67 ఎకరాలు
- ఆ భూమిని అప్పగించాలంటూ యజమానులు కోరుతున్నారన్న కేంద్రం
వివాదంలో లేని 67 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని రామ జన్మభూమి నయాస్ కోరుతోందని పిటిషన్ లో కేంద్రం తెలిపింది. వివాదాస్పద భూమిని సున్ని వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.