Mahesh Babu: మహేష్ 'మహర్షి' లొకేషన్ వీడియో లీక్!

  • పల్లె వాతావరణంలో 'మహర్షి' షూటింగ్
  • చూసేందుకు భారీగా వచ్చిన ప్రజలు
  • సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహర్షి'కి సంబంధించిన ఫోటోలు, లొకేషన్ వీడియో లీక్ అయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను పొల్లాచ్చి పరిసరాల్లోని పల్లె వాతావరణంలో తీస్తుండటంతో, విషయం తెలుసుకున్న అక్కడి ప్రజలు, మహేశ్ ను చూసేందుకు ఎగబడ్డారు.

వారిని అదుపు చేయలేని పరిస్థితిలోనే చిత్ర బృందం షూటింగ్ ను కొనసాగించగా, గుంపులో నుంచి ఓ వ్యక్తి షూటింగ్ ను వీడియో తీశాడు. దీన్ని మహేశ్ అభిమానులే సోషల్ మీడియాలో షేర్ మీద షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో పొలాల మధ్య మహేశ్‌ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉన్న చిత్రాలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ తో సెల్ఫీలు దిగిన వారు కూడా తమ ఫోటోలను పోస్ట్ చేసి ఆనందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఏప్రిల్ లో సినిమాను విడుదల  చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
Mahesh Babu
Maharshi
Shooting
Leaked

More Telugu News