agrigold: అగ్రిగోల్డ్ ఆస్తులను సీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం

  • హైదరాబాద్, విజయవాడ, గుంటూరులోని 33 ఆస్తులు సీజ్
  • 47.26 ఎకరాల భూమి, 4672.76 చదరపు గజాల స్థలం జప్తు
  • వీటి విలువ దాదాపు రూ. 30 కోట్లు
అధిక వడ్డీ ఆశ చూపించి, లక్షలాది మంది నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను స్వీకరించిన అగ్రిగోల్డ్ సంస్థ ఆ తర్వాత బోర్డు తిప్పేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ ఆస్తులను ఏపీ ప్రభుత్వం జప్తు చేసింది. దాదాపు రూ. 30 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరులో ఉన్న 33 ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. మొత్తం 47.26 ఎకరాల భూమి, 4672.76 చదరపు గజాల స్థలాన్ని జప్తు చేశారు. అవ్వా వెంకట శివరామకృష్ణ, అవ్వా కరుణశ్రీ, అవ్వా శివరామ్, అవ్వా శ్రీదేవి, అవ్వా సీతారామారావు, అవ్వా మాధవీలత, అవ్వా ఉదయ్ భాస్కరరావుల పేరిట ఉన్న ఆస్తులను సీజ్ చేశారు.
agrigold
assets
seize
ap
government

More Telugu News