Jarkhand: జార్ఖండ్ లో ఎన్ కౌంటర్... ఐదుగురు మావోయిస్టుల మృతి!

  • ఈ ఉదయం సింగభూం జిల్లాలో ఘటన
  • మావోలపై పక్కా సమాచారం అందడంతో కూంబింగ్
  • ఘటనా స్థలిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్న అధికారులు
  • గాయాలతో పారిపోయిన మావోయిస్టు కోసం గాలింపు!
ఈ ఉదయం జార్ఖండ్ రాష్ట్రంలోని సింగభూం జిల్లా పరిధిలోని అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరుగగా, ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతంలో మావోలు తిరుగుతున్నారన్న పక్కా సమాచారం అందగా, సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, కోబ్రా బెటాలియన్, రాష్ట్ర సాయుధ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. వీరికి మావోలు తారసపడగా, లొంగిపోవాలని హెచ్చరించినా, వారు వినకుండా కాల్పులు ప్రారంభించారని, దీంతో ఎన్ కౌంటర్ అనివార్యమైందని ఓ అధికారి తెలిపారు. ఈ క్రమంలో ఐదుగురు మావోయిస్టులు మరణించారని, మరో మావోయిస్టు గాయాలతో తప్పించుకోగా, అతని కోసం వెతుకుతున్నామని వెల్లడించారు. ఘటనా స్థలిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, ఒక 303 రైఫిల్, రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నామని, కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు.
Jarkhand
Singbhoom
Encounter
Police
Maoists

More Telugu News