Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 12 మంది దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
మధ్యప్రదేశ్‌‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఉజ్జయిని జిల్లా రాంగఢ్‌లో జరిగిందీ విషాదం. ఓ వివాహ వేడుకకు హాజరైన కుటుంబం సోమవారం అర్ధరాత్రి దాటాక వ్యానులో వస్తుండగా రాంగఢ్‌లోని నగ్డా రోడ్డు వద్ద మరో వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి వ్యాను నుజ్జు నుజ్జు అయింది. వ్యానులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Madhya Pradesh
ujjain
Ramgarh
Road Accident

More Telugu News