upasana: టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారనే వార్తలపై ఉపాసన కొణిదెల స్పందన!

  • కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై పోటీ చేస్తున్నారంటూ కథనం
  • చిన్నాన్న మంచి పనులు చేస్తున్నారంటూ కితాబు
  • తన ఉద్యోగంతో సంతోషంగా ఉన్నానన్న ఉపాసన
యంగ్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన భర్త గురించే కాకుండా, ఎన్నో విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె గురించి ఒక పత్రికలో వచ్చిన ఓ వార్తపై సోషల్ మీడియా ద్వారా ఆమె స్పందించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై టీఆర్ఎస్ తరపున ఉపాసన పోటీ చేయబోతున్నారనేదే ఆ వార్త కథనం. ఈ కథనాన్ని ఉపాసన ఖండించారు. అందులో వాస్తవం లేదని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న జాబ్ ను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని ఆమె తెలిపారు. సంగీతా రెడ్డి (విశ్వేశ్వర్ రెడ్డి భార్య) తన బాస్ అని చెప్పారు. చేవెళ్లలో తన చిన్నాన్న విశ్వేశ్వర్ రెడ్డి మంచి పనులు చేస్తున్నారని తెలిపారు.
upasana
konidela
TRS
chevella
contest
konda vishweshwar reddy

More Telugu News