Andhra Pradesh: జోరు పెంచిన జనసేన.. నేడు ప్రచార రథాలను ఆవిష్కరించనున్న పవన్ కల్యాణ్!

  • ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు వీలుగా నిర్ణయం
  • వాహనాలపై పార్టీ పథకాలు, సిద్ధాంతాలు
  • నేడు విజయవాడలో ప్రారంభించనున్న జనసేనాని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన వినూత్నంగా ప్రచారంలోకి దిగుతోంది. భారీ ఎత్తున ప్రకటనలకు ఖర్చు చేయకుండా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు ప్రచార రథాలను సిద్ధం చేశారు. వాటిపై జనసేన సిద్ధాంతాలు, అధికారం అప్పగిస్తే చేపట్టబోయే పథకాల వివరాలను ముద్రించారు.

పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ ప్రచార రథాలను విజయవాడలో ఈరోజు ప్రారంభించనున్నారు. తక్కువ వ్యయంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు వీలుగా ఈ వాహనాలను రూపొందించారు.
Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
prachara radhalu
Vijayawada
inagaration
started

More Telugu News